Sep 23,2023 09:39

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) : విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌ లో బాలుడు హత్యకు గురైన సంఘటన శనివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. స్థానిక భజన కోవెలవీధికి చెందిన మైలపల్లి చిన్న అలియాస్‌ విస్కీ (17) ని గొంతు కోసి చంపి, దుండగులు సముద్రంలోకి విసిరివేశారు. వాడ బలిజ సామాజిక తరగతికి చెందిన విస్కీ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వన్‌ టౌన్‌ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.