Sep 22,2023 12:10

అమరావతి : అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టిడిపి నిర్ణయించింది. రేపటి నుండి శాసనసభ, మండలికి హాజరుకాబోమని ఎపి టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అధికార పక్షం తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీనిపై గత రెండు రోజులుగా సభలో ఆందోళన చేపట్టారు. ఈ విషయంలో చర్చ జరపాలంటూ ... టిడిపి ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ తిరస్కరించడంతో పోడియం వద్ద టిడిపి నేతలు నిరసన తెలిపారు. మరోవైపు గురువారం 16 మంది టిడిపి సభ్యులను సభ నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. శుక్రవారం కూడా నిరసన తెలిపిన టిడిపి ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ... అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని టిడిపి నిర్ణయించింది.