ప్రజాశక్తి - నందిగామ (ఎన్‌టిఆర్) : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. రక్తదానం చేయడం అభినందనీయమని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ సాంబశివరావు , పట్టణ అధ్యక్షులు దేవేందర్ రెడ్డి , కోర్ కమిటీ చైర్మన్ మహమ్మద్ మస్తాన్ , పార్టీ నాయకులు మండవ పిచ్చయ్య , చిరుమామిళ్ల చిన్ని ,రాయల జానకి రామయ్య , కౌన్సిలర్ యాకూబ్ అలి , దుబారు కరిముల్లా , పాములపాటి రమేష్ , ఆసుపత్రి వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.










