Jun 26,2023 21:20

జైపూర్‌: రాజస్తాన్‌ యువ స్పిన్నర్‌ దేశవాళీ సీజన్‌లో గుజరాత్‌ తరఫున ఆడనున్నాడు. ఈ మేరకు గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(జిసిఏ) బోర్డు సోమవారం ఓ ప్రకటనలో.. బిష్ణోయ్ గుజరాత్‌ తరఫున ఆడతానంటూ తెలుపలేదని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. ఈ క్రమంలోనే బిష్ణోయ్ తన ఇన్‌స్ట్రాలో గుజరాత్‌ జెర్సీ వేసుకున్న ఫొటోలనూ తాజాగా విడుదల చేయడం చర్చనీయాంశమైంది. జోధ్‌పూర్‌కు చెందిన బిష్ణోయ్ 10 టి20ల్లో, ఒక వన్డేలో టీమిండియా తరఫున ఆడిన అనుభముంది. అలాగే ఈ సీజన్‌ ఐపిఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్‌ తరఫున 16వికెట్లు తీశాడు. ఇక గుజరాత్‌ జట్టుతో కలిసి ప్రి సీజన్‌ క్యాంప్‌లో బిష్ణోయ్ ఉండగా.. ఆ జట్టుకు రమేశ్‌ పొవార్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రవి బిష్ణోయ్ తనదైన ముద్ర వేసుకున్నాడు. 2020 అండర్‌-19 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు భారత్‌ చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

గుజరాత్‌ చెంతకు బిష్ణోయ్