Sep 29,2023 14:34

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం : స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం చంద్రబాబును ములాఖత్‌లో భాగంగా భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, మాజీమంత్రి పొంగూరు నారాయణలు కలిశారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిని అడిగి కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జైల్లో చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి, జైల్లో అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ములాఖత్‌ సమయం ముగిసిపోవడంతో ముగ్గురూ బయటకు వచ్చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్షలకు నారా భువనేశ్వరి వెళ్లి వారితో మమేకమవుతున్న సంగతి తెలిసిందే.