ప్రజాశక్తి- నందిగామ(ఎన్‌టిఆర్) : నందిగామ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం యూనియన్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకు పెళ్ళికానుక కింద రూ.20 వేలు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు షేక్ పితాన్ మేస్త్రి, కార్యదర్శి కొట్టే వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు బండారు శేషు, ఆకుల సత్యనారాయణ మందా రామారావు, మరో కార్మికుడు కుమార్తెలు వివాహమైన సందర్భంగా వారికి పెళ్లి కానుక కింద ఒక్కొక్కరికి రూ. 5000 చొప్పున పంపిణీ చేయడం జరిగిందని యూనియన్ అధ్యక్షుడు పితాన్ తెలియజేశారు. అదేవిధంగా 60 సంవత్సరాలు దాటిన వద్ధ కార్మికులకు, వికలాంగుల కార్మికులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి ఆకుల శేషగిరిరావు, యూనియన్ నాయకులు షేక్ ఉమరవల్లి , వి నాగేశ్వరరావు, పుల్లారావు, రామస్వామి, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.










