ప్రజాశక్తి-విజయవాడ : చంద్రబాబును అరెస్ట్ చేసి 23 రోజులు గడుస్తున్నా సీఐడీ ఇప్పటి వరకు సరైన ఆధారాలు సేకరించలేదని.. ఇప్పటికీ ఆధారాల కోసం వెత్తుకుంటున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. నిరాధారణ ఆరోపణలతో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో తప్పుడు కేసులు, అరెస్టులను నిరసిస్తూ విజయవాడలోని కేశినేని భవన్ వద్ద 'సత్యమేవ జయతే దీక్ష' చేపట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఐడీ పేరు మార్చుకుంటే బెటర్ అని సూచించారు. అంతేకాదు జేపీఎస్‌గా నామకరణం చేశారు. జగన్ ప్రైవేట్ సైన్యంగా పెట్టుకోవాలని సూచించారు. చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌షాల హస్తం ఖచ్చితంగా ఉందని ఆరోపించారు.










