ప్రజాశక్తి - ఆలమూరు (అంబేద్కర్ కోనసీమ) : ఆలమూరు మండలంలోని జొన్నాడ గౌతమి గోదావరిలో వినాయక నిమజ్జన ప్రదేశాన్ని సిబ్బందితో కలసి మండపేట రూరల్ సిఐ పెద్దిరెడ్డి శివ గణేష్, ఎస్‌ఐ ఎస్.శివ ప్రసాద్ శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా సిఐ, ఎస్‌ఐ లు మాట్లాడుతూ ... గణేష్ నిమజ్జన వేడుకల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా పాల్గొంటారు కానీ అప్రమత్తంగా ఉండకూడదని అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు అన్ని శాఖల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంతరాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా తగు జాగ్రత్తలు వహించాలని, భారీ పోలీస్ సిబ్బందిని మోహరిస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనమప్పుడు ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గ్రామ పంచాయితీవారి సహకారంతో మరబట్లు, లైఫ్ జాకెట్లు, రాత్రి సమయంలో ఇబ్బంది లేకుండా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామన్నారు. హైవే అథారిటీవారి సహకారంతో భారీ ప్రొక్లెయిన్, అంబులెన్స్ ఏర్పాటు చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు, కార్యదర్శి వీరమాత, వీఆర్వో వెంకటేశ్వరరావు, శాఖల సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు.










