బంజారాహిల్స్ (హైదరాబాద్) : లంచం తీసుకుంటూ బంజారాహిల్స్ సిఐ ఎసిబికి పట్టుబడ్డారు. శుక్రవారం ఓ సమస్య పరిష్కారం కోసం బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా... సిఐ నరేందర్‌ను అధికారులు రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పీఎస్‌లో ఎన్‌స్పెక్టర్ నరేందర్‌ను ఎసిబి అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా కొంతకాలంగా సిఐ నరేందర్‌పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బంజారాహిల్స్ పీఎస్, నరేందర్ ఇంట్లోనూ ఎసిబి సోదాలు చేపట్టింది.










