ఢాకా: బంగ్లాదేశ్ కెప్టెన్, ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ ముందు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశాడు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇది అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, తమ కుటుంబసభ్యులతో చర్చలు జరిపిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. నాన్న కన్న కలను నిజం చేయడానికి ఇంతకాలం క్రికెట్‌లో కొనసాగానని తమీమ్ విలేకరుల ముందు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 16ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడింది. బంగ్లాదేశ్ తరఫున అతను బుధవారం ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. అలాగే తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానున్నట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించాడు. తాను క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్‌బోర్డు(బిసిబి)కి ట్విటర్ వేదికగా తెలిపాడు. తాను బంగ్లాదేశ్ తరఫున ఆడేందుకు సహాయపడ్డ సహచరులు, కోచ్‌లు, బోర్డు అధికారులు, కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపాడు. 2007 ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన తమీమ్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 8,313పరుగులు చేశాడు. ఇందులో 14సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో తమీమ్ ఇక్బాల్ అగ్రస్థానంలో ఉండగా.. ప్రస్తుతతరం క్రికెటర్లలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత 3వ స్థానంలో ఉన్నాడు. 70 టెస్టుల్లో 38.89 సగటుతో 10సెంచరీలు, 5,134పరుగులు చేసిన తమీమ్.. 241 వన్డేలు ఆడాడు. కూడా బాదాడు. గత ఏడాది టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్.. 2022 ఏప్రిల్‌లో ఐర్లాండ్‌తో ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు.










