Mar 06,2023 20:41

చిట్టగాంగ్‌ : ఇంగ్లండ్‌తో జరిగిన మూడో, చివరి వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి రెండు వన్డేల్లో గెలిచి ఇప్పటికే సిరీస్‌ను చేజిక్కించుకున్న ఇంగ్లండ్‌ జట్టు.. సోమవారం జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ చేతిలో 50 పరుగులు తేడాతో ఓటమిపాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాజట్టు 48.5 ఓవర్లలో 246పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు తమీమ్‌ ఇక్బాల్‌(11), లింటన్‌ దాస్‌(0) నిరాశపరిచినా.. నజ్ముల్‌(53), ముష్ఫికర్‌(70), షకీబ్‌(75) అర్ధసెంచరీలతో రాణించారు. జోఫ్రా ఆర్చర్‌కు మూడు, ఆదిల్‌ రషీద్‌, శామ్‌ కర్రన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు 43.1 ఓవర్లలో 196పరుగులకే కుప్పకూలింది. విన్సే(38), సాల్ట్‌(35), క్రిస్‌ వోక్స్‌(34) టాప్‌ స్కోరర్స్‌. షకీబ్‌కు నాలుగు, తైజుల్‌ ఇస్లామ్‌కు రెండు వికెట్లు దక్కాయి. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-1తో చేజిక్కించుకోగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ షకీబ్‌-అల్‌-హసన్‌కు, సిరీస్‌కు ఆదిల్‌ రషీద్‌కు లభించాయి. ఇరుజట్ల మధ్య మూడు టి20ల సిరీస్‌ గురువారం నుంచి ప్రారంభం కానుంది.