హైదరాబాద్: కేంద్రమంత్రి అమిత్‌షాతో బిజెపి ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరోసారి భేటీ అయ్యారు. శనివారం రాత్రి అమిత్‌షాతో సంజయ్ సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఆదివారం బిజెపి ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం కావాల్సినప్పటికీ భేటీ జరగలేదు. ఇంతలో మధ్యాహ్నం మళ్లీ బండి సంజయ్ తోనే ఆయన సమావేశం కావడంపై బిజెపి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాల బిజెపి ఎమ్మెల్యేలు పర్యటించారు. క్షేత్రస్థాయిలో పర్యటన అనంతరం వారు హైకమాండ్‌కు నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్‌షాతో బండి సంజయ్ వరుసగా భేటీ కావడంపై చర్చనీయాంశమైంది.










