Oct 03,2023 10:14

గుంటూరు : మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు మంగళవారం గుంటూరుకు తీసుకొచ్చారు. వెన్నెలపాలెం నుంచి గుంటూరు నగరపాలెం స్టేషన్‌కు అధికారులు తీసుకెళ్లారు. ప్రస్తుతం బండారును నగరపాలెం పీఎస్‌లో ఉంచారు. సిఎం జగన్‌, మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు విడివిడిగా కేసులు నమోదు చేశారు. బండారు ఇంటికెళ్లి 41ఏ, 41బీ నోటీసులిచ్చారు. హైబీపీ, మధుమేహంతో బాధపడుతున్న బండారు సత్యనారాయణకు ఎలాంటి వైద్యపరీక్షలు చేయకుండా గుంటూరుకు తరలించారు. 153ఏ, 294, 504, 505 ఐపీసీ, 67 ఐటీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో... ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా గుంటూరు నగరంపాలెం పీఎస్‌ వద్ద పోలీసుల ఆంక్షలు విధించారు. హైబిపి, మధుమేహంతో బాధపడుతున్న బండారుకు మందులు ఇచ్చేందుకు పోలీస్‌ స్టేషన్‌కు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు వెళ్లారు. తండ్రిని కలిసేందుకు అప్పలనాయుడికి పోలీసులు అనుమతినివ్వలేదు. సకాలంలో మందులు ఇవ్వకపోతే తన తండ్రికి ఇబ్బంది కలుగుతుందని అప్పలనాయుడు చెప్పారు. గుంటూరు నగరం పాలెం స్టేషన్‌ వద్ద కు వచ్చిన టిడిపి నేతలు కనపర్తి శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీరామ్‌ ప్రసాద్‌ బుజ్జి ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ను కోసం స్టేషన్‌ వద్దకు టిడిపి నేతలు వచ్చారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసర ప్రాంతాల్లోకి రానివ్వకుండా పోలీసుల అడ్డంకులు పెట్టారు.