Jul 01,2023 14:26

ముంబయి: బిసిసిఐ కొత్త స్పాన్సర్‌గా ఆడిడాస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. బైజూస్‌కు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఒప్పందం ఉన్నా స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. మార్కెటింగ్‌ ఖర్చులను కారణంగా చూపిన బైజూస్‌.. తాము టీమిండియా లీడ్‌ స్పాన్సర్‌గా ఉండటం లేదని పేర్కొంది. అలాగే టీమిండియా టూల్‌ కిట్‌ స్పాన్సర్‌ కూడా మారిపోయింది. ఇంతకుముందు ఎంపిఎల్‌ కంపెనీ ఈ టూల్‌ కిట్‌ స్పాన్సర్‌షిప్‌ చేసింది. కానీ తాజాగా ప్రముఖ స్పోర్టింగ్‌ కంపెనీ అడిడాస్‌తో ఐదేళ్లకు బిసిసిఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే లీడ్‌ స్పాన్సర్‌గా కూడా ఎక్కువ కాలం ఉండే కంపెనీతోనే డీల్‌ చేసుకోవాలని బిసిసిఐ అనుకుంటూ వచ్చింది. ఈ నిర్ణయంతో స్పాన్సర్‌షిప్‌ టెండర్లు కూడా ఆలస్యంగా విడుదల చేసింది. ఇక టీమిండియా లీడ్‌ స్పాన్సర్‌గా డ్రీమ్‌11తో ఒప్పందం చేసుకున్నట్లు బిసిసిఐ ప్రకటించింది.