- బంగ్లా పర్యటనకు జట్టును ప్రకటించిన బిసిసిఐ
ముంబయి: బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే భారత మహిళలజట్టును భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) సోమవారం వెల్లడించింది. భారత మహిళలజట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికైంది. అలాగే ప్రారంభ మహిళల ప్రిమియర్ లీగ్‌లో రాణించిన యస్టికా భాటియా, రీచా ఘోష్ వికెట్ కీపర్లుగా ఎంపికయ్యారు. అస్సాంకు చెందిన ఉమా ఛెత్రీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనుంది. ఈ సిరీస్ జులై 9నుంచి టి20 సిరీస్.. జులై 16 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్నాయి. జులై 22న జరిగే చివరి వన్డేతో బంగ్లాదేశ్‌లో భారతజట్టు పర్యటన ముగియనుంది. ఈ సిరీస్‌కు మీర్‌పూర్‌లోని షేర్-ఎ-బంగ్లా జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భారతజట్టు బంగ్లాదేశ్‌తో మూడు టి20లతోపాటు మరో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది.
షెడ్యూల్..
జులై 9 : తొలి టి20
జులై 11 : రెండో టి20
జులై 13 : మూడో టి20
జులై 16 : తొలి వన్డే
జులై 19 : రెండో వన్డే
జులై 22 : మూడో వన్డే
వన్డే, టి20 జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, యస్టికా భాటియా, ఉమా ఛెత్రీ(వికెట్ కీపర్లు), హర్లిన్ డియోల్, దేవిక వైద్య, అమన్‌జ్యోత్ కౌర్, మేఘన, పూజ వస్త్రాకర్, మేఘ్న సింగ్, అంజలి శర్వాని, మోనిక పటేల్, రషి కనోజియా, అనూష బరెడ్డి, మిన్నూ మణి(టి20లకు), స్నేV్‌ా రాణా(వన్డేలకు).










