Feb 23,2023 11:27

ఇండియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. పేస్‌ బౌలర్‌ రిచర్డ్‌సన్‌తో పాటు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మిచెల్‌ మార్ష్‌ లు తిరగి జట్టులో చేరనున్నారు. వన్డే జట్టుకు కెప్టెన్‌గా ప్యాట్‌ కమ్మిన్స్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. వార్నర్‌, స్మిత్‌, లబుషేన్‌ కూడా జట్టుకు అందుబాటులో ఉండనున్నారు. మార్చి 17వ తేదీన ముంబైలో ఆసీస్‌, ఇండియా మధ్య తొలి వన్డే జరగనున్నది. వైజాగ్‌లో మార్చి 19వ తేదీన, చెన్నైలో మార్చి 22వ తేదీన మిగితా మ్యాచ్‌లు జరగనున్నాయి. టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల మొదటి మ్యాచ్‌కు దూరం కానుండగా.. హార్దిక్‌ పాండ్యా సారథిగా వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు : పాట్‌ కమిన్స్‌ (సి), సీన్‌ అబాట్‌, అష్టన్‌ అగర్‌, అలెక్స్‌ కారీ, కామెరాన్‌ గ్రీన్‌, ట్రావిస్‌ హెడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మార్నస్‌ లబుషేన్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జై రిచర్డ్‌సన్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టొయినిస్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జంపా.
భారత జట్టు : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చహల్‌, మహమ్మద్‌ షమీ, మహమ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, శార్దూల్‌ ఠాకూర్‌, అక్షర్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్కట్‌.