విజయవాడ: ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమంలో కుప్పకూలి ఓ ఆశా వర్కర్ మఅతి చెందారు. తాడేపల్లిలోని ప్రకాశ్‌నగర్ వైఎస్‌ఆర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో శుక్రవారం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం నిర్వహించారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆశావర్కర్ కృపమ్మ ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. సిబ్బంది వెంటనే ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. వైద్యారోగ్యశాఖ అధికారుల ఒత్తిడే ఆమె మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మృతురాలి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.










