హైదరాబాద్: మూడో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (కాచిగూడ - బెంగళూరు) రానుంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. కాచిగూడ నుంచి ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. బుధవారం మినహా ఆరు రోజులపాటు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. కాచిగూడ నుంచి బయలుదేరి బెంగళూరుకు (610 కి.మీ. దూరం) 8.30 గంటల్లోనే చేరుకోనుంది.










