Oct 16,2023 12:10

అమరావతి : రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల కేసు వ్యవహారంలో మరో నలుగురి పేర్లను కొత్తగా చేర్చామని, రీ ఓపెన్‌ చేయాలని ఇటీవల సిఐడి పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో .... సోమవారం సిఐడి పిటిషన్‌పై విచారణ చేపట్టింది. సిఐడి అధికారులు ఇచ్చిన కొత్త ఆధారాలను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది. కేసు రీఓపెన్‌కు అభ్యంతరాలు ఉంటే ప్రతివాదులు కౌంటర్‌ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా సిఐడి తరఫు న్యాయవాదులు న్యాయమూర్తికి కొన్ని ఆడియో ఫైల్స్‌ను అందించారు. మంగళవారం మరిన్ని ఆధారాలను వీడియో రూపంలో అందిస్తామని సిఐడి న్యాయస్థానానికి తెలిపింది. అనంతరం విచారణను వచ్చే నవంబర్‌ 1 కి హైకోర్టు వాయిదా వేసింది.