Nov 21,2022 21:25

న్యూఢిల్లీ : ప్రయివేటు టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగదారులను ఛార్జీల రూపంలో భారీగా బాదనుంది. తన నెలవారీ బేసిక్‌ రీచార్జ్‌ ఫ్లాన్‌ను ఏకంగా 57 శాతం పెంచి రూ.155కు చేర్చింది. ఇంతక్రితం ఈ ప్లాన్‌ 28 రోజులు గడువుతో రూ.99కి లభించేది. అయితే తాజా ప్లాన్‌లో అపరిమిత కాలింగ్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. దీన్ని ట్రయల్‌గా తొలుగా హరియాణా, ఒడిశాల్లో ప్రారంభించినట్లు పేర్కొంది. ట్రయల్‌ రన్‌ తర్వాత.. దేశమంతా విస్తరించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతేడాది బేసిక్‌ ప్లాన్‌ రూ.79ని కూడా రూ.99కి పెంచినప్పుడు ఇదే వ్యూహం పన్నింది.