Oct 03,2023 15:18

అమరావతి: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ అక్టోబరు 10కి వాయిదా పడింది. సీఐడీ ఇచ్చిన 41ఏ నోటీసులో నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లోకేశ్‌ లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అమరావతి రింగ్‌రోడ్డు కేసులో బుధవారం విచారణకు రావాలని లోకేశ్‌కు సీఐడీ నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.