Aug 05,2023 15:16

ప్రజాశక్తి-మార్కాపురం(ప్రకాశం) : ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో ఏర్పాటు చేసిన లక్కీ షాపింగ్‌ మాల్‌ను సినీనటి హనిరోజ్‌ శనివారం ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాల్‌లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు వేలాదిమంది యువత తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. లక్కీ షాపింగ్‌ మాల్‌లో సామాన్యుల నుంచి ఉన్నత స్థాయి ప్రజల వరకు అందుబాటులో ఉండే వస్త్రాలు లభ్యమవుతాయని, ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. ఇక్కడి ప్రజలు తన రాకకోసం వేచి వేచి ఉండడం ఆనందంగా ఉందని ధన్య వాదాలు తెలిపారు.
 

rose