విజయవాడ : విజయవాడ దుర్గమ్మను ఎపి గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈవో కె.ఎస్.రామారావు, ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, వైదిక కమిటీ సభ్యులు గవర్నర్ దంపతులతోపాటు ఉన్నారు. గవర్నర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈవో చైర్మన్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రంను అందించారు.










