Sep 12,2023 21:52

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి హౌస్‌ కస్టడీ ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాదులు ఎసిబి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. దీనిపై వాదనలు విన్న అనంతరం మంగళవారం తీర్పు ఇచ్చారు. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని, ఆయనకు హౌస్‌ కస్టడీ ఇవ్వాలని ఆయన తరుపున న్యాయవాదులు కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్‌ తరుపున వాదించిన ఎఎజి పొన్నవోలు సుధాకరరెడ్డి అసలు చట్టంలో హౌస్‌ రిమాండు అనేమాట లేదని, జ్యుడీషియల్‌ కస్టడీ లేదా పోలీసు కస్టడీ అని మాత్రమే ఉందని, అది కూడా తెలియకుండా వాదనలు చేయడం ఏమిటని ప్రశించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి చంద్రబాబు తరుపున దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.