ప్రజాశక్తి-విశాఖపట్నం : సిపిఎం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం స్టీల్ ప్లాంట్ ప్రధాన అర్చ్ వద్ద జరిగే ఉక్కు రక్షణ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి హాజరైన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిహెచ్.నర్సింగరావు ఘనస్వాగతం పలికారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఉక్కు కార్మికులు స్టీల్ ప్లాంట్ వరకూ ర్యాలీ చేపట్టారు. దీంతో ఎయిర్ పోర్టు నుంచి స్టీల్ ప్లాంట్‌కి వెళ్లే ప్రధాన దారులన్నీ ఉక్కు రక్షణ నినాదాలతో మారుమోగాయి. దారులన్ని ఎర్ర జెండాలు రిపేరెప్పలాడాయి. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు లోకనాధం, జగ్గు నాయుడు తదితరులు పాల్గొన్నారు.










