తిరుపతి : రెండేళ్ల బాలుడు తప్పిపోయిన ఘటన మంగళవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ లోని ఫ్లాట్ ఫారం-3 వద్ద జరిగింది. తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానంతరం తిరుగు ప్రయాణం కోసం కుటుంబీకులు తిరుపతిలోని చెన్నై బస్టాప్ వద్దకు చేరుకొని అక్కడ సేదదీరారు. ఈరోజు తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో బాలుడు (2) తప్పిపోయినట్లు గుర్తించారు. వెంటనే బాలుడి తరపు బంధువులు పోలీసులను ఆశ్రయించారు. ఈస్ట్ పోలీసులు విచారణ ప్రారంభించారు. చెన్నై, వరసవక్కంకు చెందిన రామస్వామి చంద్రశేఖర్ కుమారుడు అరుల్ మురుగన్ (2) గా గుర్తించారు. బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద కేన్సస్ హౌటల్ వైపు వెళ్లినట్టు సిసి పుటేజ్ లో రికార్డయ్యింది. బాలుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.










