Sep 17,2023 10:01

కామవరపు కోట (ఏలూరు) : మండలంలోని జిలకరగూడెం గ్రామానికి చెందిన మరీదు సత్యవతి సెప్టెంబర్‌ 4వ తారీఖున రాజమండ్రి నుండి వెళుతున్న యాత్ర బస్సులో బద్రీనాథ్‌ యాత్రకు వెళ్లారు. కేదార్నాథ్‌, చారుదాం యాత్ర ముగించుకుని బద్రీనాథ్‌ కి వెళుతున్న సమయంలో గురువారం సాయంత్రం సత్యవతికి బిపి తగ్గటంతో సమీప ఆసుపత్రిలో వైద్య చికిత్స చేయించారు. శనివారం ఉదయం సత్యవతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులలోను, జీలకర్రగూడెం లోను విషాదఛాయలు అలుముకున్నాయి. సత్యవతితోపాటు తన సోదరి మల్లేశ్వరి కూడా ఈ యాత్రలో ఉన్నారు. సత్యవతి మృతి చెందటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. అక్కడి నుండి అంబులెన్స్‌ మాట్లాడి సత్యవతి మృతదేహాన్ని జీలకర్రగూడెం తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు.