ప్రజాశక్తి-రాయదుర్గం : అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కదరంపల్లి టోల్ ప్లాజా సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఒక లారీ గొర్రెల మందపై దూసుకెల్లడంతో 24 గొర్రెలు మేకలు మృతి చెందాయి. పెదపపూర్ మండలం చిన్నపపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర రెడ్డికి చెందిన లారీలో డ్రైవర్ నారాయణరెడ్డి ఇసుకను తీసుకొని రాయదుర్గానికి వస్తుండగా కదరంపల్లి టోల్ ప్లాజా సమీపంలో ముందుకు వెళుతున్న గొర్రెల మందపై లారీ దూసుకు వెళ్ళింది. దీంతో 24 గొర్రెలు మేకలు మృతి చెందాయి. బొమ్మనహల్ మండలం గోనేహళ్ గ్రామానికి చెందిన స్వామి రెడ్డి, తిప్పయ్య గంగ మూర్తి సన్నయ్యకు చెందిన గొర్రెలు మేతకై ఆవులదట్ల వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. రాయదుర్గం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










