రాయదుర్గం (హైదరాబాద్) : అపార్ట్‌మెంట్ పైనుండి దూకి పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాయదుర్గంలో జరిగింది.
పోలీసుల కథనం మేరకు ... సోమవారం రాత్రి 7.30 గంటలకు బాలుడు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ ఎంత సమయమైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అతడి తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో కుమారుడి కోసం వెతికారు. అనంతరం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అదఅశ్యం కేసుగా నమోదు చేసి.. బాలుడి ఆచూకీ కోసం పలుచోట్ల వెతికారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం 7 గంటలకు బాలుడి కుటుంబం నివాసముంటున్న అపార్ట్‌మెంట్ పక్క బ్లాక్ ముందు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి మృతదేహం కనిపించింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కొన్ని రోజులుగా విద్యార్థి ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసకావటం.. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










