Oct 07,2022 22:38

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్శిటీ: బాలికా విద్యపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 9వ తేదీన ఫ్యూర్‌ (అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు) ఆధ్వర్యంలో 'ప్యూరథాన్‌' పేరుతో పరుగు, నడక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్యూర్‌ సంస్థ సీఈవో హేమ కంఠమనేని తెలిపారు. బెంజిసర్కిల్‌ వద్ద గల హోటల్‌ ఐరాలో ప్యూరథాన్‌కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం హేమ మాట్లాడుతూ ప్యూర్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యంగా బాలికల్లో విద్య, మహిళలు రుతు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు నగరంలోని ఈట్‌ స్ట్రీట్‌ వద్ద నుండి రెండు, ఐదు కిలోమీటర్ల నడక, పరుగుపందెం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ క్రాంతిరాణా టాటా ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చని తెలిపారు. తాము నిర్వహించే కార్యక్రమానికి తరుణీతరంగాలు, రోటరీ మిడ్‌టౌన్‌, హోటల్‌ ఐరా, ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ సంస్థలు సహకరించనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలన్నారు. ఇతర వివరాలకు 8121189026 ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో తరుణీ తరంగాలు అధ్యక్షురాలు డాక్టర్‌ రావిశారద, ఉపాధ్యక్షురాలు కె.స్వరూపారాణి, సభ్యులు కె.ఉషారాణి, ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ నుండి కవిత, ఆశాజ్యోతి నిర్వాహకులు మాధవీలత, ఐరా మేనేజింగ్‌ డైరెక్టర్‌ పర్వతనేని రవికుమార్‌ పాల్గొన్నారు.