7న టిడిపి విస్తృతస్థాయి సమావేశం
ప్రజాశక్తి-ఉదయగిరి : 7వ తేదీన జరిగే తెలుగుదేశం పార్టీ మండల, జిల్లా నాయకుల సమావేశాన్ని విజయవంతం చేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి మాజీ జెడ్‌పి చైర్మన్ పొన్నేబోయిన చెంచలబాబు యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం చంచల బాబుయాదవ్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 7వ తేదీ నెల్లూరులోని వేణుగోపాల్ నగర్‌లో జరిగే జోనల్ విస్తృతస్థాయి టిడిపి మండల స్థాయి జిల్లాస్థాయి నాయకులతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసే కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి నాయకులు పాల్గొనాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు జరిగిన టిడిపి విజయం తద్దమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సిహెచ్ బయన్నయాదవ్, రియాజ్, ఓబుల్ రెడ్డి, బీసీ సెల్ నాయకులు ఆదినారాయణ ముదిరాజ్, మండల మాజీ ఉపాధ్యక్షులు సిహెచ్ రమణయ్య, నల్లిపోగు నరసింహులు, బొజ్జ నరసింహులు, శివకృష్ణ పాల్గొన్నారు.










