Jul 07,2023 10:22

అమరచింత-వనపర్తి (తెలంగాణ) : వనపర్తి జిల్లా అమరచింత కస్తూర్బా విద్యాలయంలో 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి సాంబారు, వంకాయ కూరతో భోజనం చేసిన విద్యార్థినిలంతా అర్ధరాత్రి నుంచి కడుపులో మంట, వాంతులతో బాధపడ్డారు. విద్యాలయంలో ఒక్కరే టీచర్‌ ఉండటంతో ఆసుపత్రికి తీసుకువెళ్లడం సాధ్యపడలేదు. శుక్రవారం ఉదయం విద్యార్థినిల పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 40 మంది విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.