Jan 30,2023 19:29

మాట్లాడుతున్న అంగన్వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు శ్రీలక్ష్మి

ప్రజాశక్తి - రాయచోటి టౌన్‌ : అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం పిబ్రవరి 6న రాష్ట్ర వ్యాతంగా అన్ని జిల్లాల కలెక్టరేట్‌ లను ముట్టడిస్తున్నామని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) అన్నమయ్య జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌. శ్రీలక్ష్మి, పి. రాజేశ్వరి పేర్కొన్నారు. సోమవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డి.భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాతంగా ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశపెట్టబోయే ఫేస్‌ యాప్‌ను విరమించుకోవాలని పేర్కొన్నారు. ఒకటి నుండి అంగన్వాడీ సెంటర్ల లో ప్రవేశ పెట్టే ఫేస్‌ యాప్‌ ను విరమించుకోవాలని తెలిపారు. 2 జిబి మొబైల్స్‌ ఇచ్చి 8 జిబి పనులు చేయించుకోవడం సరైందని కాదని పేర్కొన్నారు. నెట్‌ సౌకర్యం కేంద్రాలలో ఉండదన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ నిర్ణయించి, సంక్షేమ పతకాలు అమలు చేయాలన్నారు. సంపూర్ణ పోషణకు మెనూ ఛార్జీలు పెంచాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషన్‌కు అర్హత అన్న ఆయాలకు కచ్చితంగా పోస్ట్‌ ఇచ్చేవరకు ఇంటర్వ్యూలు జరగకుండా పోరాడుతామన్నారు. మినీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలకు మార్చాలని, సకాలాలంలో వేతనాలు పెండింగ్‌ జీతాలు బిల్లులు ఇవ్వాలని ఉద్ఘాటించారు. ధరలకనుగునంగా కనీసవేతనం రూ.26 వేలు , రిటైర్డ్‌ మెంట్‌ బెనిఫిట్‌ సౌకర్యం రూ. 5లక్షలు పెంచాలని, పర్యవేక్షన పేరుతో వేధింపులు ఆపాలని తెలిపారు. సమావేశంలో జిల్లా కోశాధికారి పి. బంగారు పాప, అన్ని ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు నాగమణి ఖాజాబి, సిద్దమ్మ, వనజ, మధురవాణి, స్వరూపరాణి, గౌరీ, ఒబులమ్మ పాల్గొన్నారు.