Feb 03,2023 22:29

ఫొటో : మాట్లాడుతున్న కళాశాల సెక్రటరి దామిశెట్టి బాలసురేష్‌నాయుడు

5న డిబిఎస్‌లో ఉద్యోగ ఎంపికలు
ప్రజాశక్తి - కావలి : స్థానిక డిబిఎస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో 5వ తేదీన ఆఫ్‌ క్యాంపస్‌ సెలక్షన్లు 2017, 2018, 2019, 2020, 2021, 2022 సంవత్సరాల్లో బిసిఎ, బిఎస్‌సి, ఎంసిఎ, బిటెక్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మెగా క్యాంపస్‌ సెలక్షన్లు తమ కళాశాలలో జరుగుతాయని కళాశాల సెక్రటరీ దామిశెట్టి బాలసురేష్‌బాబు పేర్కొన్నారు. శుక్రవారం కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో నూరుశాతం ఉద్యోగకల్పనే లక్ష్యంగా కళాశాల పనిచేస్తుందని ఆయన తెలిపారు. మునుపటి సంవత్సరం అనేక బహుళజాతి కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు.
అదేరీతిలో ఈ సంవత్సరం కూడా పేరెన్నికగన్న బహుళజాతి కంపెని హెచ్‌సిఎల్‌లో ఉద్యోగాలు కల్పించాలన్న మహోన్నత ఆశయంతో ఈ సెలక్షన్లు జరుపుతున్నామన్నారు. కళాశాల కరస్పాండెంట్‌ దామిశెట్టి సుధీర్‌నాయుడు మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన డిబిఎస్‌ కళాశాల 4వ సంవత్సరం చదువుతున్న అన్ని విభాగాల విద్యార్థులకు ''ఆన్‌క్యాంపస్‌'' సెలక్షన్లు హెసిఎల్‌ కంపెనీలో ఉద్యోగెంపికలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల పరిపాలన అధికారి జి.రమేష్‌బాబు, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.