ప్రజాశక్తి - వన్‌టౌన్ : మూడు రోజులు వాటర్ పైప్‌లైన్ మరమ్మతు పనుల కారణంగా మహంతిపురం, 170 సచివాలయం పరిధిలో మంచినీరు సక్రమంగా అందకపోవటంతో ప్రజల ఇబ్బందులను 50వ డివిజన్ కార్పొటర్ బోయి సత్యబాబు అధికారులు దష్టికి తీసుకెళ్ళారు. ఈ నేపధ్యంలో బుధవారం సంబంధిత అధికారులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయించారు. మంచినీటి సరఫరాలో జరుగుతున్న ఇబ్బందులు దష్టిలో పెట్టుకొని ప్రజలకు ప్రత్యేక మార్గాల ద్వారా నీటి సరఫరా అందించేలా నగరపాలక సంస్థ అధికారులు ముందస్తు ప్రణాళికలతో వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయడం ద్వారా కనీసం తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని, ఆయాప్రాంతాల్లో పాడైపోయిన బోరింగ్‌లను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తగిన సిబ్బందిని నియమించి ప్రజలకు నీటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా కార్పొరేటర్ బి.సత్యబాబు అధికారులను కోరారు. ఈ సందర్భంగా డివిజన్‌లోని ప్రజలకు వాటర్ ట్యాంక్ ద్వారా మంచినీటిని దగ్గరుండి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అభివద్ధి కమిటీ నాయకులు ఎ.శ్రీను, మజీద్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం నుండి మంచినీటి సరఫరా యధావిధిగా జరుగుతుందని వాటర్ సప్లై అధికారులు తెలియచేసినట్లు సత్యబాబు తెలిపారు.










