ప్రజాశక్తి-బత్తలపల్లి: సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలైన్‌లో నిలబడిన ప్రతి ఒక్కరికీ ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు హరిజవహర్‌లాల్, పూల భాస్కర్ సంబంధిత సిబ్బందికి సూచించారు. సోమవారం మధ్యాహ్నం బత్తలపల్లిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం నుంచి ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, సమయానికి అనుగుణంగా వచ్చి క్యూలైన్లలో ఉన్న వారందరికీ స్లిప్‌లు ఇచ్చి క్యూలైన్‌లో ఉంచాలన్నారు. 4 గంటల అనంతరం ప్రధాన ద్వారం మూసివేయాలని సూచించారు. ఆనంతరం క్యూలైన్‌లో ఉన్న ఓటర్లతో ముచ్చిటించారు. సీఐ మన్సూరుద్దీన్, ఎస్‌ఐ బీవీ శ్రీహర్ష బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆయన వెంట ఆర్టీఓ తిప్పేనాయర్, డిప్యూటీ తహశీల్దార్ ప్రసాద్, ఎఎస్ లక్ష్మీనరసింహ, ఎఆర్‌డిలు, తదితరులు ఉన్నారు.










