Apr 04,2023 21:57

ఫొటో : ఆసరా చెక్కును మహిళలకు అందజేస్తున్న రాజ్యసభ సభ్యులు బిఎంఆర్‌, ఎంఎల్‌ఎ రామిరెడ్డి

3వ విడత 'ఆసరా' అందజేత
ప్రజాశక్తి-కావలి : కావలి మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ఆవరణంలో మంగళవారం కావలి మండల పొదుపు మహిళలకు 3వ విడత వైఎస్‌ఆర్‌ ఆసరా కింద రూ.8,96,00,000 చెక్కును 1128 పొదుపు గ్రూపులలోని 12,036మంది మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌ రావు, కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి పాల్గొని, చెక్కును పంపిణీ చేశారు. కావలి ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన వైఎస్‌ఆర్‌ ఆసరా మూడో విడత కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, కావలి నియోజకవర్గ పరిశీలకులు కదిరి బాబురావు హాజరయ్యారు. తదుపరి వారు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పొదుపు సంఘాల సభ్యులు వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా కలుగుతున్న లబ్ధితోపాటు, బ్యాంకు రుణం ద్వారా సమకూర్చుకుంటున్న స్వయం ఉపాధి పథకాలకు చెందిన స్టాల్స్‌ పరిశీలించి, మహిళలతో ముచ్చటించారు.
అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేక్‌ కటింగ్‌ చేసి నాయకులకు లబ్ధిదారులకు తినిపించారు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు, చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు డైరెక్ట్‌గా వారి ఖాతాల్లో జమ్మచేశారని, టిడిపి పార్టీకి హయాంలో చంద్రబాబు నాయుడు ఏ అభివృద్ధి పనులు చేయలేదని కేవలం శిలాఫలకాలే వేశారని విమర్శించార. టిడిపి ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాలు 2023 సంవత్సరంలో ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ శీనానాయక్‌, డి.ఎస్‌.పి వెంకటరమణ, డిఎల్‌డిఒ ఎస్‌.కనక దుర్గాభవాని, కావలి ఎఎంసి చైర్మన్‌ సన్నీబోయిన ప్రసాద్‌ యాదవ్‌, జెడ్‌పిటిసి జంపాని రాఘవులు, ఎంపిపి ఆలూరి కొండమ్మ, మాజీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్‌ రెడ్డి, జిల్లా వాణిజ్య విభాగాల అధ్యక్షుడు కన్నమర్లపూడి నారాయణ, నెల్లూరు జిల్లా ఎస్‌సిసెల్‌ అధ్యక్షుడు పందిటి కామరాజు, రాష్ట్ర గౌడ సంఘ డైరెక్టర్‌ నాయుడు రాంప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.