May 26,2023 20:23

30 పడకల ఇఎస్‌ఐ ఆస్పత్రి నిర్మించాలి

రాయచోటి టౌన్‌ : అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా 30 పడకల ఇఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించాలని సిఐటియు జిల్లాప్రధాన కార్యదర్శి ఎ.రామంజులు, ఉపాధ్యక్షులు ఎస్‌.ఓబులమ్మ డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక బీడీ కార్మికుల ఆసుపత్రి వద్ద జరిగిన సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇఎస్‌ఐ పథకాన్ని బలోపేతం చేయాలని జరిగిన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మికుల వైద్యం కోసం నిర్మించిన ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకుందన్నారు. రెగ్యులర్‌ వైద్యులు తగినంత స్టాఫ్‌ లేరని శ్రీకాళహస్తికి చెందిన డిస్పెన్సరీ డాక్టర్‌ వారంలో కేవలం బుధ, గురు వారాల్లో మాత్రమే ఉంటారని తెలిపారు. మిగిలిన రోజులు రోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉందన్నారు. ఇఎస్‌ఐ స్కీమ్‌ ద్వారా కార్మికుల ఉద్యోగులకు మందులు, సిక్‌ లీవులు నిరుద్యోగభతి, పెన్షన్లు వంటి తదితర సౌకర్యాలకు తమ జీతంలోని కొంత నగదును ఎంప్లారు మెంట్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ పేరుతో రిజర్వ్‌ బ్యాంక్‌లో జమ చేసిన లక్షా పదివేల కోట్లు ఉందన్నారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా ఉఫాధ్యక్షుడు కె.నాగబసిరెడ్డి, సిఐటియు నాయకులు విజయ, సిద్ధమ్మ, బీడీ కార్మికులు లక్ష్మిదేవి, అన్సారీ, రమీజా, గంగులమ్మ, బదరీనాథ్‌లతో పాటు పలువురు బీడీ కార్మికులు పాల్గొన్నారు.
ఇఎస్‌ఐ పథకాన్ని బలోపేతం చేయాలి
మదనపల్లె అర్బన్‌ : కార్మికులకు ఆసుపత్రి, మందులు, పెన్షన్లు, సిక్‌ వేతనాలు, నిరుద్యోగ భతి తదితర సౌకర్యాలు కల్పించే ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ (ఇఎస్‌ఐ) పథకాన్ని బలోపేతం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు, సిఐటియు జిల్లా కార్యదర్శి డి.ప్రభాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఇఎస్‌ఐ డిస్పెన్సరీ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇఎస్‌ఐ పథకాన్ని నీరుగారుస్తున్నాయని విమర్శించారు. దేశమంతటా ఇఎస్‌ఐ పథకాన్ని 2022 కల్లా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఎక్కడా అమలు కాకపోవడం శోచనీయమన్నారు. ఇఎస్‌ఐ ఆసుపత్రులు డాక్టర్లు, పరికరాలు, సిబ్బంది, మందుల లేమితో కునారిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లాల్లోనూ కనీసంగా 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని, తన బాధ్యతలను నిర్వర్తించకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వంపై నెట్టిందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారాహిత్యానికి వ్యతిరేకంగా కార్మికులను సిఐటియు ఐక్యం చేసి పోరాటాలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఇఎస్‌ఐ డిస్పెన్సరీ డాక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి గంగాదేవి, నాయకులు గోపాల్‌, రెడ్డిప్రసాద్‌, రమణ, కార్తీక్‌, రమణమ్మ పాల్గొన్నారు.
- రాయచోటి : ధర్నా నిర్వహిస్తున్న సిఐటియు నాయకులు, కార్మికులు