పీలేరులోని బోదేషావలి దర్గా
ప్రజాశక్తి-పీలేరు : పట్టణంలోని హజరత్ బోదేషావలీ దర్గాలో గంధం, ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దర్గా ముజావర్ రెడ్డి బోదేషా తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులకు గంధం, ఉరుసు నిర్వహణ వివరాలు తెలియజేశారు. 29వ తేదీ గురువారం రాత్రి స్థానిక సదుం రోడ్డులోని సుభాన్ సాహెబ్, దిలిగిర్ సాహెబ్ మనవళ్ల కుటుంబం నుంచి గంధం ఊరేగింపుగా దర్గాకు తీసుకు వస్తారని పేర్కొన్నారు. 30వ తేదీ శుక్రవారం రాత్రి దర్గాలో ఉరుసు, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. హిందూ ముస్లిం సోదరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని అందరినీ ఆహ్వానించారు.










