Mar 26,2022 23:05

రాయదుర్గంలో ర్యాలీ నిర్వహిస్తున్న ఎల్‌ఐసి ఉద్యోగులు

ప్రజాశక్తి-రాయదుర్గం    ఈ నెల 28, 29 తేదీలలో దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని అఖిలభారత బీమా ఉద్యోగుల సంఘం రాయదుర్గం శాఖ అధ్యక్షులు జి.చిన్న మల్లేష్‌, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున కోరారు. ఎఐఐఇఎ పిలుపుమేరకు బీమా ఉద్యోగులు ఏజెంట్లు, సిఐటియు నాయకులు రాయదుర్గం పట్టణంలోని ప్రధాన వీధుల్లో శనివారం ర్యాలీ నిర్వహించారు. బీమా సంస్థ కార్యాలయం వద్ద ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మల్లికార్జున, మల్లేష్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటోందన్నారు. నష్టాల పేరిట ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతోందని అన్నారు. కార్మిక చట్టాలను కుదించి వారి హక్కులను కాలరాస్తోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడానికి కార్మిక చట్టాలను పరిరక్షించడానికి, ఈ నెల 28, తేదీలలో తలపెట్టిన సార్వత్రిక సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నాగరాజు రమేష్‌, ఎల్‌ఐసి ఉద్యోగులు రవీంద్ర, తిప్పేస్వామి, లక్ష్మీనారాయణ, కుళ్లాయప్ప, సత్యనారాయణ, ఎల్‌ఐసి ఏజెంట్‌లు మల్లారెడ్డి, మరేష్‌, రామాంజనేయులు, గురు, నిస్సార్‌ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె నోటీసు అందజేత..
ఈ నెల 28, 29 తేదీలలో సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నట్లు అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బేబీ మేరీ, యువ నాయకులు మల్లికార్జున తెలిపారు. ఈ మేరకు సమ్మె నోటీసును సిడిపిఒ ప్రభావతికి శనివారం అందజేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు బేబీ, మేరీ తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెకు కెవిపిఎస్‌ సంపూర్ణ మద్దతు
ఈ నెల 28, 29 తేదీలలో దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెకు కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సమితి జిల్లా అధ్యక్షులు నాగరాజు చెప్పారు.
గుంతకల్లు : ప్రజా, ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్రంలోని మోడీ సర్కారు మెడలు వంచేందుకు దేశవ్యాప్తంగా తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు సిపిఎం, అనుబంధ ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొంటామని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు అన్నారు. శనివారం స్థానిక హంపిరెడ్డి భవనంలో పార్టీ, ప్రజా సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్త సమ్మెలో ప్రజలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు ప్రజా సంఘాలు, విద్యార్థులు, యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ వర్గ సభ్యులు దాసరి శ్రీనివాసులు, మారుతీ ప్రసాద్‌, జగ్గిలి రమేష్‌, రంగమ్మ, పట్టణ నాయకులు చంద్రశేఖర్‌, ఓబులేసు, రాము నాయక్‌, అబ్దుల్లా, సునీల్‌, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్‌, వెంకీ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఐఎఫ్‌టియు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ
ఈ నెల 28, 29 తేదీలలో చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్‌టియు నాయకులు గుంతకల్లు పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఐఎఫ్‌టియు జిల్లా అధ్యక్షుడు బి.సురేష్‌, డివిజన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, చిన్నా, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు సత్తార్‌, డిఎస్‌యు నియోజకవర్గం కార్యదర్శి రంగస్వామి, మధు, భీమేష్‌ యాదవ్‌, సాయి భరత్‌, రామాంజి, గోపాల్‌, కమిటీ సభ్యులు రఘునాథరెడ్డి, గోపి, బాషా, జానయ్య తదితరులు పాల్గొన్నారు.
పామిడి : దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సభ్యులు నిర్మల పిలుపునిచ్చారు. శనివారం పంచాయతీ వర్కర్లు, అంగన్‌వాడీలు, ఆటోడ్రైవర్లు, హమాలీలతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈనెల 28, 29న చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదంచేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం నాయకులు అనిమిరెడ్డి, మండల కార్యదర్శి లక్ష్మినారాయణ, ముత్యాలు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
ఉరవకొండ రూరల్‌ : కార్మిక వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ డివిజన్‌ అధ్యక్షురాలు లక్ష్మి కళ్యాణి, కార్యదర్శి ఆశ్వర్థమ్మ డిమాండ్‌ చేశారు. ఈ నెల 28, 29న చేపట్టిన దేశవాప్త సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడపనకల్‌ మండల కేంద్రంలో శనివారం విడుదల చేశారు. సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సెక్టార్‌ లీడర్లు అరుణ, కాంతమ్మ, సుమంగళమ్మ, దుర్గాదేవి, వనజాక్షి, అంగన్వాడి కార్యకర్తలు కృష్ణవేణి, శశికళ, లక్ష్మీదేవి, రాధా తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం కార్పొరేషన్‌ : ఈనెల 28, 29 తేదీల్లో చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కార్మికుల చైతన్యం కోసం ప్రజాశక్తి దినపత్రిక తీసుకొచ్చిన స్పెషల్‌ను అనంతపురం నగర పాలక సంస్థ 6 సర్కిల్స్‌ నందు ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు, కార్మికులు శనివారం ఆవిష్కరించారు. సిఐటియు ఓల్డ్‌ టౌన్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, న్యూ టౌన్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు గురురాజ, ముర్తుజా, మున్సిపల్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, మునిసిపల్‌ యూనియన్‌ నగర అధ్యక్షులు ఎటిఎం నాగరాజు, నగర ఉపాధ్యక్షులు బండారు ఎర్రి స్వామి, సలహా కార్యదర్శి శేషేంద్ర కుమార్‌, కోశాధికారి తిరుమలేశు, సహాయ కార్యదర్శి బత్తల ఆదినారాయణ, మహిళా కన్వీనర్‌ లక్ష్మీనరసమ్మ, లక్ష్మీదేవి, మంత్రి వరలక్ష్మి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.