ప్రజాశక్తి -కందుకూరు : . ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 26వ తేదీ నుంచి టిడిపి ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరుగుతుందని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించిన బస్సు యాత్ర కందుకూరు నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం టిడిపి ప్రభుత్వం హయాంలో కందుకూరులో నిర్మించిన టిట్కో గహాలను సందర్శిస్తామని తెలిపారు.అనంతరం రాళ్ళపాడు ప్రాజెక్టుని సందర్శించి గ్రామాల్లో బస్సు యాత్ర సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పరిపాలన ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరించారు. జయప్రదం చేయాలని కోరారు. టిడిపి నాయకులు దామ మల్లేశ్వరరావు, గోచిపాపల మోషే ,చిలకపాటి మధు, షేక్ రప,˜ీ ముచ్చు శ్రీనివాసరావు ఉన్నారు.










