పోలీసులు కేసు నమోదుచేసిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్‌ను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు హైకోర్టుకు రాష్ట్ర సర్కారు చెప్పింది. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు మొబైల్ యాప్ కూడా ఉన్నట్లు ఏజీ ఎస్.శ్రీరామ్ తెలిపారు. వెబ్‌సైట్ నుంచి 94,650, మొబైల్ యాప్ నుంచి 5 లక్షల 50 వేలు చొప్పున ఎఫ్‌ఐఆర్‌లను పలువురు డౌన్‌లోడ్ చేస్తున్నారని తెలిపారు. మీడియా, ఇతరులకు చెందినవారిపై సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతున్న వాళ్లపై పోలీసులు కేసులు పెట్టినా... వాటి ఎఫ్‌ఐఆర్‌లను అప్‌లోడ్ చేయడం లేదని టివి-5 న్యూస్ ఛానెల్ అధిపతి బొల్లినేని రాజగోపాల్ నాయుడు వేసిన పిల్‌ను సోమవారం చీఫ్ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. అనంతరం విచారణను ఆగస్టు 16కు హైకోర్టు వాయిదా వేసింది.










