Jul 07,2021 06:54

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఉత్తర బీహార్‌ నుంచి జార్ఖండ్‌ ఇంటీరియర్‌ ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్‌ వరకూ సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఒకటి మంగళవారం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో రాగల 24 గంటల్లో మోస్తరు వర్షాలు, పలు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమలో కూడా తేలిక పాటినుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురుస్తాయని, భారీ వర్షాలకు అక్కడక్కడా అవకాశం ఉందని పేర్కొన్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో అత్యధికంగా ఒంగోలులో 47.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా అనంతపురంలో 0.4 మిల్లీమీటర్లు నమోదైంది.