Jul 20,2021 07:15

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం రాత్రి వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం, ఉత్తర తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌ పరిసరాలపై సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడ్డాయని పేర్కొన్నారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.