Mar 20,2023 21:00

సన్మానిస్తున్న దృశ్యం

సన్మానిస్తున్న దృశ్యం
22వ తేదిలోగా పెన్షనర్లు లైఫ్‌ సర్టిఫికేట్లు అందజేయాలి
నెల్లూరు:పెన్షనర్లు అందరూ ఈ నెల 22వ తేదిలోగా తమ లైఫ్‌ సర్టిఫికేట్లను అందజేయాలని డివిజనల్‌ సబ్‌ ట్రెజరీ అసిస్టెంట్‌ ట్రెజరీ అధికారి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్‌ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ట్రెజరీ అధికారి ముఖ్యఅతిధిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు ఎస్‌ఎం గౌస్‌ మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు వినతిపత్రం ఈ నెల 9వ తేదిన అందజేశామన్నారు
. ముఖ్యంగా పెన్షన్‌ చెల్లింపులు ట్రెజరీ అధికారుల పరిధిలో ఉంచడం న్యాయమని అధికారులు దృష్టికి తీసుకెళ్లామన్నారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన ట్రెజరీ అధికారి మాట్లాడూతు పెన్షనర్లు తమ లైఫ్‌ సర్టిఫికేట్‌ అందజేయడం అలస్యం అయితే మేనెల పెన్షన్‌ నిలిపిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ రాష్ట్ర సంఘం వైస్‌ ప్రెసిడెంట్‌ ఎ.రమణయ్య,రాజారావు తదితరులు పాల్గొన్నారు.