మాట్లాడుతున్న కలెక్టర్
20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన
-స్పందన అర్జీలకు అధిక ప్రాధాన్యత
నెల్లూరు:ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో భాగంగా కావలి రానున్నారని, ఆరోజున చుక్కల భూములు, రీ సర్వే కార్యక్రమం సంబంధించి ప్రత్యేక ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగానికి కలెక్టర్ కెవిఎన్ చక్రధర్‌బాబు సూచించారు. జిల్లా కలెక్టర్ సూచించారు. ఆ ప్రాంతంలో రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ శాఖల పరిధిలో చేపట్టవలసిన పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేసి మంజూరు కోసం ఈ సోమవారమే ఉన్నతాధికారులకు పంపాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన కార్యక్రమం ప్రారంబోత్సవానికి ముందుగా అధికారులనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ స్పందన అర్జీలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొందరు జిల్లా అధికారులు వారికి వచ్చిన స్పందన అర్జీలను చూడకపోవడం సరైంది కాదన్నారు. ప్రతిరోజు వారి లాగిన్లను తెరచి ప్రజల అర్జీలను సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన అర్జీల పరిష్కారంపై తరచూ సమీక్షిస్తున్నారన్నారు.జిల్లాలో పరిష్కారం అవుతున్న స్పందన అర్జీల నాణ్యతను పరిశీలించేందుకు జిల్లా ఆడిట్ బందం ఒకటి పనిచేస్తుందన్నారు. వారు వివిధ ప్రభుత్వ శాఖల్లో స్పందన అర్జీల పరిష్కార వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వారం వారం అందించే నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు.జిల్లా అధికారులు స్పందన అర్జీల పరిష్కారం పై ప్రత్యేక దష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరిష్కారంలో విధిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. వచ్చిన దరఖాస్తులే మళ్లీ మళ్లీ రాకుండా చూడాలన్నారు నిర్ణీత గడువులోనే అర్జీలను పరిష్కరించాలన్నారు. జిల్లాలో ముఖ హాజరుకు సంబంధించి ఇంకా చాలా ప్రభుత్వ శాఖల ఉద్యోగులు వారి పేర్లను నమోదు చేసుకోలేదని, కొందరు నమోదు చేసుకున్న సరిగా వినియోగించడం లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. ఇకపై అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు తమ ఉద్యోగులందరూ తప్పనిసరిగా ముఖ హాజరు లో పేర్లు నమోదు చేయడంతో సహా ప్రతిరోజు నూటికి నూరు శాతం ముఖ హాజరు అయ్యేలాగా పర్యవేక్షించాలన్నారు.జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో 1644 కోర్టు రిట్ పిటిషన్లు, 307 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రధానంగా జలవనుల శాఖలో 186 పంచాయతీరాజ్ శాఖలో 41 కేసులు అత్యధికంగా పెండింగ్లో ఉన్నాయన్నారు.కోర్టు కేసుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి కషి చేయాలన్నారు.కోర్టుదికరణ కేసులకు వెంటనే కౌంటర్ ఆఫిడవిట్లు దాఖలు చేసి వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ స్పష్టం చేశారు.శనివారం రోజున గహ నిర్మాణ దినంగా పరిగణించి క్షేత్రస్థాయిలో జగనన్న లేఅవుట్లను పరిశీలించాలని చెప్పడం జరిగిందని ఆమేరకు ఎవరెవరు పర్యటించారని విచారించి జగనన్న లేఔట్ లలో స్థితిగతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇకపై జిల్లాలో అన్నిచోట్ల గహ నిర్మాణాలు ఊపందుకోవాలని రోజువారి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రత్యేక దష్టి సారించాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ డ్వామా, మెప్మా పీడీలు కె వి సాంబశివారెడ్డి, డి.వెంకటరావు, రవీంద్ర, జెడ్పీ సీఈవో బి. చిరంజీవి, ఎఫ్ ఎస్ ఓ ఆసిఫా, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఆర్డబ్ల్యూఎస్ జలవనరుల శాఖల ఎస్ ఈ లు రంగ వరప్రసాదరావు, కష్ణమోహన్, డిటిసి బి చందర్, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, భూ రికార్డుల సర్వే ఏడి హనుమాన్ ప్రసాద్, బీసీ సంక్షేమ అధికారి వెంకటయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.










