Feb 02,2023 21:19

క్లస్టర్‌ ఇన్‌ఛార్జితో మాట్లాడుతున్న నియోజకవర్గ పరిశీలకులు వైకుంఠం మల్లికార్జున

         ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌   ఇదేం ఖర్మ..మనరాష్ట్రానికి కార్యక్రమా న్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని నియోజకవర్గ టిడి పి పరిశీలకులు వైకుంఠం మల్లికార్జున పిలుపునిచ్చా రు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జి, మండల నాయకులు, ఐటిడిపి సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందన్నారు. ముఖ్యంగా సిఎం జగన్‌ విధ్వంసకరపాలన సాగిస్తున్నారన్నారు. వైసిపికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి ప్రజలంద రూ సంసిద్ధులయ్యారన్నారు. కావున ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను ఓటు రూపంలో మలుచుకో వాలనని సూచించారు. అదేవిధంగా ఇదేం ఖర్మ-మనరాష్ట్రానికి కార్యక్రమం నియోజకవర్గంలో జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు ఓటరు వెరిఫికేషన్‌పై కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెద్దఎత్తున డబుల్‌ ఓట్లు, షిఫ్టింగ్‌ ఓట్లు, పెళ్లి అయిన వారి ఓట్లు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కమతం కాటమయ్య, ఫణికుమార్‌, పురుషోత్తంగౌడ్‌, పోతుకుంట లక్ష్మన్న, నాగూరుహుస్సేన్‌, అత్తర్‌ రహీంబాషా, అంబటి సనత్‌, రాళ్లపల్లి షరీఫ్‌, చింతపులుసు పెద్దన్న, గోసల శ్రీరాములు, కేశగాళ్ల శీన, తోట వాసుదేవ, చెలిమి శివరాం, తదితరులు పాల్గొన్నారు.