Feb 14,2022 20:42
  • రైతు నేతలను ఇళ్లలోనే నిర్బంధించిన పోలీసులు

జలంధర్‌ : 2014 ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్‌ గాంధీ కారణంగా పంజాబ్‌లో తన హెలికాప్టర్‌ను నిలిపివేశారని ప్రధాని మోడీ సోమవారం విమర్శించారు. 'బిజెపి ప్రధాని అభ్యర్థిగా నా పేరు ప్రకటించారు. ప్రచారం కోసం పఠాన్‌కోట్‌, హిమాచల్‌లో పర్యటించాలనుకున్నాను. వారి యువరాజు (రాహుల్‌గాంధీ) అమృత్‌సర్‌లో ఉంటడంతో నా హెలికాప్టర్‌ను అనుమతించలేదు' అని జలంధర్‌లో సోమవారం జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోడీ చెప్పారు. అమరీందర్‌ సింగ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంపైనా కాంగ్రెస్‌పై మోడీ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలే రిమోట్‌ ద్వారా నడుస్తాయని మోడీ ఆరోపించారు. ఇదే సభలో అమరీందర్‌ కూడా పాల్గన్నారు. దేశ భద్రతలో పంజాబ్‌ కీలక పాత్ర పోషిస్తుందని, ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలని ప్రధాని మోడీ చెప్పారు.

  • రైతు నేతల నిర్బంధం

ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రైతులు ఆందోళన చేస్తారనే అనుమానంతో రైతు సంఘాల కీలకమైన నేతలను ఇళ్లలోనే దిగ్బంధించారు. గత నెలలో పంజాబ్‌లో ప్రధాని మోడీ భద్రత అంశంపై వివాదం రేగిన తరువాత ఆ రాష్ట్రంలో ఆయన పర్యటించడం ఇదే మొదటిసారి.

  • ప్రతి ఎన్నికల్లో కొత్త భాగస్వాములతో వస్తారు : ఎస్‌పిపై మోడీ విమర్శ

యుపిలోని కాన్పూర్‌లో నిర్వహించిన ఎనిుకల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ప్రతి ఎన్నికల్లోనూ కొత్త భాగస్వామ్య పార్టీతో వస్తారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి పాలైతే.. భాగస్వాములను నిందిస్తారని అన్నారు. జయంత్‌ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌తో సమాజ్‌వాది పార్టీ పొత్తుపై స్పందిస్తూ.. ఎస్‌పి పగలు, రాత్రి తేడా లేకుండా యుపినికొల్లగొడుతోందని అన్నారు. వారు మాఫియాతో చేతులు కలిపారని ఆరోపించారు. ప్రతి నగరంలో కాన్పూర్‌ మాఫియాను గంజ్‌ మొహల్లాగా మారుస్తున్నారని అన్నారు.