వాషింగ్టన్ : ప్రముఖ హాలీవుడ్ నటి ఆష్లే షెర్లిన్ హత్య కేసులో 'హాలీవుడ్ రిప్పర్'గా ప్రసిద్ధి చెందిన మైఖెల్ గార్గిలోకు లాస్ ఏంజిల్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 20 ఏళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. దీంతో పాటు మరో హత్యాయత్నం కేసులోనూ మైఖెల్‌ను దోషిగా 2019లో కోర్టు నిర్థారించింది. అతనికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు 2021, జూలైలో ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పు నిచ్చింది. నిందితుడు మైఖెల్.. హాలీవుడ్ నటి ఆష్లే ఎల్లరిన్‌తో పాటు మరో మహిళ మరియా బ్రూనోను దారుణంగా హత్య చేయడమే కాక మరో స్త్రీపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 'హాలీవుడ్ రిప్పర్'గా పిలిచే మైఖేల్ 2001, ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో ఆష్లే ఎల్లెరిన్(22) నివాసంలోనే ఆమెను దారుణంగా పొడిచి చంపాడు. ఆమె శరీరంపై 47 కత్తిపోట్లు ఉన్నాయి. అయితే హత్యకు గురైన రోజు రాత్రి ఆమె, తన సహానటుడు ఆస్టన్ కుచర్‌తో డేట్‌కు వెళ్లాల్సి ఉంది. ఎల్లెరిన్ కోసం ఆమె నివాసానికి వెళ్లిన కుచర్ ఎంతసేపు తలుపు కొట్టినా తీయలేదు. దీంతో అనుమానంతో కిటికీలోంచి చూడగా.. నేలపై ఏదో పడినట్లు కనిపించింది. అయితే వైన్ పడి ఉంటుందని భావించి.. తాను నివాసం నుండి వెళ్లిపోయానని కుచర్ అనంతరం కేసులో సాక్ష్యమిచ్చాడు. ఆ మరుసటి రోజు ఎల్లరిన్ మృతదేహాన్ని ఆమె ఇంట్లో గుర్తించారు.
అనంతరం మైఖెల్ 2005లో మారియా బ్రూనో(32) అనే మహిళను దారుణంగా హత్య చేశాడు. బ్రూనో హత్య జరిగిన మూడేళ్ల తర్వాత మైఖేల్ మరో మహిళ మిషెల్లె మర్ఫీపైన దాడి చేశాడు. మర్ఫీ ఫిర్యాదుతో మైఖెల్ నేరాలు వెలుగు చూశాయి. రెండు హత్యలు, ఒక హత్యాయత్నం అభియోగాల్లో మైఖేల్‌ను కోర్టు దోషిగా నిర్థారించి, అతనికి మరణశిక్ష విధించింది. అయితే ఈ శిక్ష అమలు చేయడానికి వీలు లేదు. 2006 అనంతరం కాలిఫోర్నియాలో మరణశిక్షలు అమలు కాలేదు. ఉరిశిక్షపై నిషేధం అమలులో ఉంది.










