Feb 10,2023 21:01

- సమావేశంలో మాట్లాడుతున్న సాయికుమార్‌

రాయచోటి : ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే చట్టం తేవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాయచోటి తాలూకా అధ్యక్షులు సాయికుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉద్యోగుల జీతాలు, చెల్లింపులు, చట్టబద్దత గురించి చర్చ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయికుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగస్తులకు 10వ తేదీ అయినా జీతాలు పడడంలేదన్నారు. సరెండర్‌ లీవ్‌, జిపిఎఫ్‌ ఊసేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై రాష్ట్ర అధ్యక్షులు సూర్య నారాయణ తీసుకొనే భవిష్యత్తు కార్యాచరణ గ్రామాలు, మండలాలలోని ఉద్యోగుల పూర్తి మద్దతుఉంటుందని పేర్కొన్నారు. తాలూకా కార్యదర్శి సుజిత్‌ మాట్లాడుతూ పెన్షనర్ల జీతాలు ఇంతవరకు పడడంలేదు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి జీతాలు పడేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మల్లికార్జున, శ్రీనివాసులు నాయక్‌ ,రమణ సంయుక్త కార్యదర్శి వలి, శివ రాజశేఖర్‌, హరిప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.